విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి

గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు

మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు

అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను లోకేష్ ను కలిశారు. మంత్రిని పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించి యువనేతకు అభినందనలు తెలిపారు. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత అయిదేళ్లుగా గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యాప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మళ్లీ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. గతంలో మాదిరి ఉపాధ్యాయులపై అనవసరమైన పనిభారం, వేధింపులు ఉండవని తెలిపారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు https://www.youtube.com/watch?v=ZZmc_sqgm7c పాతికమంది

వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్ https://www.youtube.com/watch?v=mfLVx7dJ-O0 దివ్యాంగ విద్యార్థుల

అధైర్యపడొద్దు… అండగా ఉంటా! “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా